News August 6, 2025
మొగల్తూరు: ఎమ్మార్వోకి సైబర్ నేరగాళ్ల బురిడీ యత్నం

మొగల్తూరు ఎమ్మార్వో రాజ్ కిశోర్ ను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. మంగళవారం ఎమ్మార్వోకు ఐఏఎస్‌ను అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. MRO బంధువు స్థానిక పీహెచ్సీ వద్ద ఉన్నాడని అతనికి అత్యవసరంగా డబ్బులు అవసరమని ఫోన్‌పే చేయాలని సూచించారు. ఎమ్మార్వో వస్తున్నా అని చెప్పగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.
Similar News
News August 31, 2025
లింగ నిర్ధారణకు పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.
News August 31, 2025
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం వివిధ శాఖాల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రీ సర్వే, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పిజిఆర్ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు, క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు.
News August 30, 2025
శిశుమరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష

తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్షలో మాట్లాడారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదయ్యాయి.