News October 5, 2025
మొగల్తూరు: తప్పిపోయిన బాలికను అప్పజెప్పిన పోలీసులు

భీమవరం నుంచి పేరుపాలెం బీచ్‌కు ఓ కుటుంబం సరాదాగా గడిపేందుకు వచ్చారు. కానీ ఇంతలోనే ఎనిమిదేళ్ల బాలిక తప్పిపోవడంతో వారు ఆందోళన చెందారు. తక్షణం పెరుపాలెం బీచ్ అవుట్ పోస్ట్ పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేయగా బాలికి ఆచూకీ కోసం గాలించారు. బీచ్ నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ప్రధాన రహదారి వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా బాలికను కానిస్టేబుల్ సత్యనారాయణ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News October 5, 2025
ఈనెల 7న ఉమ్మడి జిల్లాల స్కూల్ గేమ్స్ ఎంపికలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 14 అండర్ 17 బాల బాలికల స్కూల్ గేమ్స్ ఎంపికలను ఈనెల 7న నిర్వహిస్తున్నామని స్కూల్ గేమ్స్ కార్యదర్శులు డి.సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు శనివారం తెలిపారు. టేబుల్ టెన్నిస్, మాల్కంబ్, లాన్ టెన్నిస్ ఎంపికలను వీరవాసరం ఎంఆర్‌కె జడ్పీ హైస్కూల్, చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హైస్కూల్, బీమవరం టౌన్ హల్, పాలకొల్లులో జరుగుతాయన్నారు.
News October 5, 2025
తణుకు: హత్య కేసులో ప్రధాన నిందితులు వీరే

తణుకులో సంచలనం రేకెత్తించిన యువకుడి హత్య కేసులో నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు, వల్లూరి పండు బాబు, సరెళ్ల సాయి కృష్ణ, బంటు ఉదయ్ కిరణ్, గంటా ఫణీంద్ర బాబు, న్యాయవాది భార్య తిర్రే శిరీషలను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మృతదేహాన్ని తరలించడానికి వినియోగించిన కారు యజమాని, న్యాయవాది సోదరుడు తిర్రే విజయకృష్ణ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు.
News October 5, 2025
నరసాపురం: నేటి నుంచి పంటి రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో నిలిచిన పంటి రాకపోకల్ని నేటి నుంచి అధికారులు పునరుద్ధరిస్తున్నట్లు నరసాపురం ఎమ్మార్వో సత్యనారాయణ చెప్పారు. గత వారం రోజులుగా గోదావరి వరద ఉద్ధృతికి ముందస్తుగా సఖినేటిపల్లి- మాధవాయిపాలెం రేవుల మధ్య పంటి రాకపోకల్ని ఆపేశారు. దీంతో లంక ప్రజలు చించినాడ మీదుగా చుట్టూ తిరిగే వచ్చారు. యంత్రాంగం ఈ దారిలో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి కష్టాలు తప్పనున్నాయి.