News February 17, 2026

మొగళ్లమూరు: ఆస్తి రాసిస్తే అనాథను చేసింది

image

మొగళ్లమూరుకు చెందిన వాసర్ల లక్ష్మి సోమవారం కలెక్టరేట్‌లో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్తి రాసిచ్చిన తర్వాత పెంపుడు కుమార్తె తనను నిర్లక్ష్యం చేస్తూ, మానసిక వేధింపులకు గురిచేస్తోందని కలెక్టర్‌కు విన్నవించారు. భర్త మృతితో ఒంటరినైన తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కుమార్తె పేరిట చేసిన రెండున్నర ఎకరాల దానసెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఆస్తిని తిరిగి ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.

Similar News

News February 17, 2026

తెలంగాణ హరితాభివృద్ధికి కీలక వేదికగా ఎదిగింది: మంత్రి

image

ఎఫ్‌సీఆర్‌ఐ తెలంగాణ హరితాభివృద్ధికి కీలక వేదికగా ఎదిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. Forest College and Research Institute (FCRI)లో 10వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మొక్కలను నాటారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో సంస్థ ముందంజలో ఉందన్నారు.

News February 17, 2026

వికారాబాద్‌లో ఈనెల 24న బియ్యం వేలం

image

జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో పట్టుబడిన సుమారు 583 క్వింటాళ్ల రేషన్ ఫిబ్రవరి 24న వేలం నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వికారాబాద్‌లో 68.05 క్వింటాళ్లు, మండల స్టాక్ పాయింట్ పరిగిలో 86.50 క్వింటాళ్లు తాండూరులో 261.20 క్వింటాళ్లు, కొడంగల్‌లో 167.15 క్వింటాళ్లు మొత్తం 582.90 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం వేస్తున్నట్లు చెప్పారు.

News February 17, 2026

పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

image

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్‌స్టాల్
✒మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి  తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT