News September 10, 2025
మొగిలిచెర్ల శిల్పాలు ఏకవీర దేవి ఆలయానికి తరలింపు

WGL నగరానికి చెందిన 31 పురాతన శిల్పాలను మొగిలిచెర్ల గ్రామం నుంచి ఏకవీరదేవి ఆలయానికి తరలించారు. GWMC అధికారులు 2 రోజులుగా ఎంతో జాగ్రత్తగా ఈ శిల్పాలను తరలించి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఈ చర్య వల్ల విలువైన మన సాంస్కృతిక వారసత్వం సంరక్షణలోకి రావడంతో పాటు, ప్రజలు వాటిని దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. మన చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే ఈ శిల్పాల పరిరక్షణలో GWMC సిబ్బంది కృషిని అభినందించారు.
Similar News
News September 10, 2025
సామర్లకోట: ఉచిత బస్సు పథకం రద్దు కోరుతూ పాదయాత్ర

ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ విశాఖపట్నం నుంచి అమరావతికి చింతకాయల శ్రీనివాసరావు అనే ఆటో కార్మికుడు చేపట్టిన పాదయాత్ర బుధవారం సామర్లకోటకు చేరింది. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో ఆటో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని శ్రీనివాస్ కోరారు.
News September 10, 2025
సంగారెడ్డి: 238 మందికి జీపీవోలకు పోస్టింగ్

ఇటీవల గ్రామ పాలన అధికారులుగా నియామక పత్రాలు అందుకున్న 238 మందికి పోస్టింగ్ ఇస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. మండల కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న మరో 87 మందికి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. పోస్టింగ్ పొందిన వారు సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.
News September 10, 2025
‘మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు’

మద్దూరులోని మీసేవ కేంద్రాలను జిల్లా ఐడీఎం మేనేజర్ విజయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వినియోగదారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు కనిపించేలా సేవల చార్జీల వివరాలు ప్రదర్శించాలని, అధిక రుసులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.