News August 14, 2024
మొదటి విడతలో కడపకు దక్కని ఛాన్స్
రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలలో కడప జిల్లాకు స్థానం దక్కలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేసే జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కడప జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రారంభానికి చోటు దక్కలేదు. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రెండో విడత జాబితాలో జిల్లాకు స్థానం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సిఉంది.
Similar News
News January 18, 2025
YSR జిల్లాపై చంద్రబాబు అసంతృప్తి
చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో చివరి మూడు స్థానాల్లో YSR జిల్లా, అల్లూరి, తూ.గో జిల్లా ఉండగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను CM చంద్రబాబు హెచ్చరించారు.
News January 18, 2025
నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. ట్రాఫిక్ ఆంక్షలు.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మైదుకూరుకు వెళ్లే వాహనాల దారి పూర్తిగా మళ్లించారు. బద్వేలు- పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు ఖాజీపేట, నాగసానిపల్లె మీదుగా వెళ్లాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, కర్నులు వైపు వెళ్లే వాహనాలు టౌన్‌లోకి రాకుండా జాతీయ రహదారి పైనుంచి వెళ్లాలని CI సయ్యద్ తెలిపారు.
News January 17, 2025
మైదుకూరుకు సీఎం.. షెడ్యూల్ ఖరారు!
మైదుకూరులో రేపు CM చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12 గం. నుంచి హెలికాఫ్టర్ ద్వారా మైదుకూరు చేరుకుని, అనంతరం 12:20 నుంచి 1 గం. వరకు NTR వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1:55 నుంచి మైదుకూరు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇళ్లను సందర్శిస్తారు. 2:15 నుంచి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.