News February 21, 2026

మొదటి స్థానంలో స్టేషన్ ఘనపూర్: కడియం

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 85 శాతం ప్రారంభించి, ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం శ్రీపతిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మరో 3,500 ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయన్నారు.

Similar News

News February 21, 2026

పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు.. సీఎం ప్రకటన

image

AP: ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘‘ఇవి వారానికోసారి గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికిరాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. వచ్చేనెల కల్లా అన్ని పంచాయతీల్లో 100% ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం. రాజమండ్రి, KNL, KDP, నెల్లూరులో రూ.1,254CRతో PPP విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తెస్తాం’’ అని తెలిపారు.

News February 21, 2026

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలోని గ్రామపంచాయితీల పరిధిలో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ.125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.54.00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించాలన్నారు.

News February 21, 2026

NRPT: బాలసదనం, వృద్ధాశ్రమంలో జడ్జి తనిఖీ

image

నారాయణపేట పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని శనివారం జూనియర్ సివిల్ జడ్జి అవినాష్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వృద్ధులు, అనాథ పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో, పిల్లలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమయానికి భోజనం అందించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. వంటగదిలో ఆహార ధాన్యాలను, పదార్థాలను తనిఖీ చేశారు. పరిసరాలను శుభ్రంగా పెట్టాలన్నారు.