News October 13, 2025
మొదటి 5 స్థానాల్లో జిల్లా ఉండేలా పనిచేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో ఉందని, మొదటి 5 స్థానాల్లో ఉండే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. 10,982 ఇళ్లు మంజూరు కాగా 7343 మార్కౌట్ చేయగా.. 2984 బేస్మెంట్ స్థాయిలో, 721 గోడల నిర్మాణం వరకు, 369 స్లాబ్ దశలో ఉండగా 3 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయన్నారు. ఇందిరమ్మ కమిటీలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 14, 2025
LOC వెంబడి ఉగ్రమూక చొరబాటు యత్నం!

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ వైపు నుంచి కొన్ని అనుమానాస్పద కదలికలను భారత ఆర్మీ గుర్తించింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అటుగా జవాన్లు కాల్పులు జరిపారు. పాక్ వైపు నుంచి సరిహద్దు దాటే ప్రయత్నం జరిగినట్లు ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
News October 14, 2025
రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

RR జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
News October 14, 2025
రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.