News August 28, 2025
మొన్న అలా.. నిన్న ఇలా: ఏమిటండీ కొండా గారూ?

బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కామెంట్స్ ఆ పార్టీలోనే చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ నాయకులు తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని.. అందుకే ఫుట్‌బాల్‌ను గిఫ్ట్‌గా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి ఇవ్వడానికి తెచ్చానని మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో వ్యాఖ్యానించారు. అయితే బుధవారం దీనికి భిన్నంగా.. కాంగ్రెస్ పార్టీని ఎలా ఫుట్‌బాల్ ఆడుకోవాలో కార్యకర్తలకు చెప్పేందుకే ఇచ్చానని చెప్పడం ఆశ్చర్యకరం.
Similar News
News August 28, 2025
హైదరాబాద్‌లో 1.40 లక్షల గణనాథుడి ప్రతిమలు

మహానగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బస్తీ, కాలనీ, గల్లీ తేడా లేకుండా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. నగర వ్యాప్తంగా 1.40 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారుల అంచనా. నిమజ్జనం జరిగే వరకు ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదానాలు ఏర్పాటు చేసి నవరాత్రులను ఘనంగా జరుపుకోనున్నారు. శుక్రవారం నుంచి నిమజ్జనాల హడావుడి షురూ అవుతుంది.
News August 28, 2025
భారీ వర్షాలు: HYD- ఆదిలాబాద్ వయా కరీంనగర్ రూట్ మ్యాప్

భారీ వర్షాలతో NH- 44 నాగ్‌పూర్ హైవే దెబ్బతింది. ప్రజల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ అమలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మెడ్చల్ చెక్‌పోస్ట్ సిద్ధిపేట- కరీంనగర్ – కోరుట్ల – మెట్‌పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు. కార్లు తూప్రాన్- సిద్ధిపేట- జగిత్యాల- కోరుట్ల- మెట్‌పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వైపు వెళ్లాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు.
News August 28, 2025
HYD: గుర్తుంచుకోండి.. ఈ శనివారమే కౌన్సెలింగ్

రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ శనివారం 30న మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. NRI కోటాలో అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ(బీటెక్), బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్లు మిగిలిపోవడంతో ఈ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉ.10 గంటలకు హాజరుకావాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వివరాలకు pjtau.edu.in చూడాలన్నారు.