News November 20, 2025

మొన్న కవిత కామెంట్.. నిన్న తుమ్మల రియాక్షన్

image

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కవిత పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ లీడర్‌ను వదులుకొని కేసీఆర్ పెద్ద పొరపాటు చేశారని, బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు. కవిత కామెంట్స్ చేసిన మరుసటి రోజే బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ముందు కవిత చేసిన వ్యాఖ్యలకు BRS సమాధానాలు చెప్పాలని తుమ్మల అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Similar News

News November 22, 2025

నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ సత్యసాయి(D) పుట్టపర్తికి వెళ్లనున్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉ.11 గంటలకు ముర్ము అక్కడికి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టులో CM చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. మ.3.40గంటలకు రాధాకృష్ణన్ చేరుకుంటారు. సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్, చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

News November 22, 2025

పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

image

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.