News August 8, 2024

మొరాయిస్తున్న బయోమెట్రిక్ హాజరు పరికరాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Similar News

News February 12, 2026

MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

image

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 11, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.