News October 29, 2025

మోంతా ఎఫెక్ట్.. వర్షపాత వివరాలు ఇలా

image

జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. భువనగిరి 2.4 మిమీ, వలిగొండ 18.6, నారాయణపూర్ 19.6, చౌటుప్పల్ 16, పోచంపల్లి 16.4, ఆత్మకూరు 11.2, మోత్కూరు 12.4, అడ్డగూడూర్ 11.2, గుండాల 9.6, బొమ్మలరామారం 6.2, యాదగిరిగుట్ట 4, మోటకొండూరు 7.2, ఆలేరు 4.4, రాజపేట 2, తుర్కపల్లి 5.6 మిమీ వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా నారాయణపురంలో నమోదైంది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News October 29, 2025

సూర్యాపేట: ప్రాణం తీసిన మొంథా తుఫాన్

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో విషాదం జరిగింది. మద్దిరాలకి చెందిన లక్ష్మీనారాయణ (45) ద్విచక్ర వాహనంపై మెడికల్ షాప్‌కు వెళ్తుండగా కొత్త బడి దగ్గర చెట్లు కూలి వ్యక్తి మృతి చెందాడు. తానంచర్ల నుంచి మద్దిరాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 29, 2025

వికారాబాద్: భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సమీక్షించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని, సాయంకోసం కంట్రోల్ నంబర్ 8712670056కు కాల్ చేయాలన్నారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్లలోని వాగులు, చెరువులలోని వరద నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు.

News October 29, 2025

ఓడలరేవు తుఫాను బాధితులకు సీఎం భరోసా

image

కోనసీమ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించారు. అల్లవరం మండలం ఓడలరేవు పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందిన సహాయంపై అడిగి తెలుసుకున్నారు. బాధితులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వారికి భరోసా ఇచ్చారు.