News January 24, 2025

మోకాళ్లపై కూర్చొని విద్యార్థుల ప్రదర్శనలు తిలకించిన నిర్మల్ కలెక్టర్ 

image

ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే అధికారులు ప్రత్యేక కుర్చీల్లో కూర్చుంటారు.. కానీ నిర్మల్‌లో అందుకు భిన్నంగా మోకాళ్లపై కూర్చుండి ప్రదర్శనలు చూశారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నిర్మల్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. మోకాళ్లపై కూర్చుని బాలికల ప్రదర్శనలను తిలకించారు.

Similar News

News February 12, 2026

నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

<>నార్త్ <<>>ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌ 11 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 5, 6తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech రిమోట్ సెన్సింగ్& GIS, జియోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్, BE/BTech, NET/ GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ సైంటిస్ట్‌కు నెలకు రూ.56,100, JRFకు రూ. 37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: nesac.gov.in

News February 12, 2026

KMR: జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు సిద్ధం: SP

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా జిల్లా వ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతి సామరస్యాలను కాపాడేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

News February 12, 2026

నెల్లూరు: మినీ గోకులాల నిర్మాణాల్లో నిబంధనలకు తూట్లు..!

image

నిబంధనలకు విరుద్ధంగా మినీ గోకులాలు నిర్మాణాలు చేపట్టి రాయితీలు పొందుతున్నారు. కొండాపురం(M) ఇసకదామెర్లలో ప్రభుత్వ భూమిలో పోజిషన్ సర్టిఫికెట్స్‌ను అడ్డదారిలో పొంది సబ్సిడీపై షెడ్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ పైపులు వెళ్లే మార్గంలో దీన్ని చేపట్టడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా స్పందించలేదట. ఉన్నతాధికారులు స్పందించకపోతే ఇలాంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంది.