News February 5, 2025

మోకిల: స్కూల్ బస్సు‌ను ఢీకొని IBS విద్యార్థి మృతి

image

స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్‌పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్‌పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 1, 2026

OMG.. HYDలో భారీ LIVE FISH

image

నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప జాలరుల వలకు చిక్కింది. ఓ వ్యక్తి ఆదివారం సరదగా అలా చెరువు వద్దకు వెళ్లాడు. 14కేజీల భారీ చేప చిక్కను కిలోల లెక్కన కొనుగోలు చేశాడు. దీంతో కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద చేపను లైవ్‌లో చూశారా?

News March 1, 2026

HYD: నకిలీ ఇన్సూరెన్స్‌లు.. 9 మంది అరెస్ట్

image

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.

News March 1, 2026

HYD: ఇవి కాపాడుకుంటే ₹కోట్లు సంపాదించొచ్చు

image

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెబుతారు. ఈ సూత్రం ఎప్పటికీ వర్తిస్తుందని HYD జీవన్ దాన్ అధికారులు పేర్కొన్నారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, కిడ్నీలు ₹కోట్లు పెట్టినా దొరకకపోవచ్చని వాటిని పదిలంగా కాపాడుకోవాలని సూచించారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ₹లక్షల్లో సేవ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. అవయవాలు ఫెయిలైనవారు 4వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.