News January 26, 2026
మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోక్షజ్ఞ తొలి సినిమాను లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్‌తో రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 6, 2026
రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలివే..

ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. యాపిల్, జామ పండ్లతో పాటు టమాటాలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తం శుద్ది అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ఆకుకూరలు, బీట్‌రూట్, బెల్లం, పసుపు వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 6, 2026
రెండు రోజుల్లో రూ.7,090 తగ్గిన గోల్డ్ రేటు

బంగారం ధర ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,070 తగ్గి రూ.1,52,350కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.7,090 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పతనమై రూ.1,39,650 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 6, 2026
INDతో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాక్‌కే దెబ్బ!

T20 WCలో భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌కు గ్రూప్ స్టేజ్ దాటడమే కష్టంగా మారొచ్చు. ఈ మ్యాచ్ ఆడకపోతే గ్రూప్‌లోని మిగతా జట్లపై(USA, నమీబియా, నెదర్లాండ్స్) కచ్చితంగా గెలవాలి. లేదంటే NRRపై ఆధారపడాల్సి వస్తుంది. 2024 WCలో PAKను USA ఓడించింది. దీంతో ఈసారీ ఆ టీమ్ నుంచి పాక్‌కు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో INDతో మ్యాచ్ ఆడితేనే గెలుపు కోసం ప్రయత్నించేందుకు PAKకు మరో అవకాశం(మ్యాచ్) ఉంటుంది.


