News December 23, 2025
మోటకొండూరు: పోరాడితేనే హక్కులను సాధించుకోగలం: కవిత

పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జన జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి జిల్లా మోటకొండూరులో ఆమె మాట్లాడారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు.
Similar News
News December 25, 2025
జగన్‌కు ముద్దు పెట్టిన విజయమ్మ

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.
News December 25, 2025
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను జిల్లాలో విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. ఈ మాంజా మనుషులతో పాటు పక్షులు, పర్యావరణానికి ఎంతో హానికరమని పేర్కొన్నారు. నైలాన్, సింథటిక్ దారాల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, వీటి వినియోగంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విక్రయదారులపై నిఘా ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
News December 25, 2025
వాజ్‌పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు

AP: దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్‌పేయి అని CM చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో సుపరిపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు ఇది. విగ్రహంతో పాటు ఆయన చరిత్ర ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం. ఈ శత జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉంది. దేవతల రాజధాని అమరావతికి ఒక నమూనాగా ఈ ప్రజా రాజధాని అమరావతిని నిలబెట్టాలన్నదే నా ధ్యేయం’ అని తెలిపారు.


