News December 31, 2025
మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.
Similar News
News February 10, 2026
ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
News February 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్‌సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.
News February 10, 2026
కల్తీ నెయ్యి.. చంద్రబాబుకు పెద్ద జియ్యంగార్ల లేఖ

AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై పెద్ద జియ్యంగార్ల మఠం ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ అపచారమని, బాధ్యతారహితమైన చర్య అని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో తిరుమలలో అపచారాలు జరగకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది. ఆలయాల పవిత్రతను, ధర్మాన్ని రక్షించే శక్తిని సీఎంకు ఇవ్వాలని ఆకాంక్షించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే <<19088531>>ఈడీ<<>> ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


