News November 6, 2025

‘మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్’ ప్రారంభం

image

భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా, సురక్షితంగా, పిల్లల స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రస్తుత అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు సౌకర్యాలు, భద్రత, సౌందర్యం, ప్రాప్యత, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాల్లో మెరుగుదలకు విస్తృత అవకాశాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

BECILలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా(BECIL)9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PWBDలకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:
www.becil.com/Vacancies

News November 6, 2025

ఏపీలో కొత్తగా 2 జిల్లాలు..మరి పలాస..?

image

APలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం 2 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో పలాసను జిల్లాగా మార్చాలన్నా ప్రతిపాదనను పాలకులు పట్టించుకోలేదు. పునర్విభజనను కూటమి మళ్లీ తెరపైకి తేగా..నిన్న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ప్రస్తావించకపోవడం ఉద్దానం వాసుల ఆశలను నీరుగార్చారు. మరో 2 రోజుల్లో రానున్న నివేదికలోనైనా తమ ప్రాంతం పేరు రావాలని ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.

News November 6, 2025

సదర్మాట్ బ్యారేజీలో పడి యువకుడు గల్లంతు

image

మామడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పొన్కల్ గ్రామానికి చెందిన గంగపుత్రుడు పల్లికొండ సిద్ధు (19) సదర్‌మట్ బ్యారేజ్ వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు బ్యారేజ్ పై నుంచి పడి గల్లంతయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.