News January 16, 2026
మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. April 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News February 14, 2026
IND vs PAK: వర్షం అడ్డంకి లేదు.. ఫుల్ గేమ్ గ్యారంటీ?

రేపు కొలంబోలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణుల అంచనా. IND vs PAK మ్యాచ్ ప్రారంభమయ్యే టైమ్(7PM)కు స్కై క్లియర్‌గా ఉంటుందని అంటున్నారు. ఆట సమయంలో వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందన్నారు. అదే జరిగితే ఓవర్ల తగ్గింపు లేకుండా పూర్తి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్నా రాత్రికల్లా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.
News February 14, 2026
పనసలో కాయకుళ్లును ఎలా నివారించాలి?

పనసలో కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిందె సమయంలో పిచికారీ చేయాలి. మళ్లీ కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చెట్టు చుట్టూ రాలిన ఆకులు, కుళ్లిన భాగాలను తొలగించి శుభ్రంగా ఉంచాలి. చెట్టుకు సరైన గాలి ప్రసరణ ఉండేలా కొమ్మలను కత్తిరించాలి. సరైన పోషకాలు, నీటి యాజమాన్యం పాటించాలి.
News February 14, 2026
ఎమ్మెల్యేలు మారకపోతే వారికే నష్టం.. CBN వార్నింగ్

AP: తాను గతంలో ఉన్నట్లే ఉంటానని, MLAలు మారకపోతే వాళ్లకే నష్టమని CM CBN హెచ్చరించారు. ‘9 పారామీటర్లతో సర్వే చేయించి వారికి సీల్డ్ కవర్‌లో ఇస్తున్నా. అది MLAల పనితీరుకు నిలువుటద్దం. వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు నా వద్ద ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఇక మంగళగిరి చీరలకు లోకేశ్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని చెప్పారు. ఇవాళ మహిళా సభ్యులు ఒకేరకమైన చీరలతో సభకు రావడం వారి ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.


