News March 3, 2025
మోత్కూరులో యువతి సూసైడ్

ఓ మైనర్ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన మోత్కూరు మున్సిపాలిటీలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఆరెగూడెంకు చెందిన మున్నకు కృష్ణా జిల్లా కొడాలి గ్రామానికి చెందిన బాలికతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఒక్కటైన ఇద్దరు మోత్కూరులో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం బాలిక ఇంట్లో ఉరేసుకుంది. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 2, 2026
సిరిసిల్ల: 72 గంటలు విధులు బహిష్కరించనున్న సెస్ ఉద్యోగులు

పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుండి 72 గంటల పాటు విధులు బహిష్కరించనున్నట్లు సెస్ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు సెస్ ఎండీ బిక్షపతికి వారు వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని, ఎఫ్‌టీఏ చెల్లించాలని ఉద్యోగుల సంఘం నాయకులు అనిల్ కుమార్, మల్లేశం డిమాండ్ చేశారు.
News March 2, 2026
MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.
News March 2, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 383 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 383 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,375 మంది హాజరు కావలసి ఉండగా 8,992 మంది హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.


