News March 3, 2025
మోత్కూరు: సహజీవనం.. బాలిక సూసైడ్

మోత్కూరు మండలంలో ఆదివారం <<15633955>>బాలిక <<>> సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఆరెగూడెంకు చెందిన మున్నతో బాలికకు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ గదిలో DEC నుంచి కలిసి ఉంటున్నారు. మున్న ఆదివారం HYD వెళ్లగా బాలిక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబీకులు, యువకుడు వచ్చాక ఆత్మహత్యకు గల కారణాలు చెప్తామని SI తెలిపారు.
Similar News
News November 5, 2025
ఏలూరు: మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఏలూరులోని మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) విద్యార్థులకు టీఈటీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇన్‌ఛార్జి కార్యనిర్వాహక సంచాలకులు ప్రభాకరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 5, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.
News November 5, 2025
కార్తీక మాసం: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

ఉసిరి చెట్టు అంటే శివస్వరూపం. అందుకే కార్తీకంలో దానికి పూజలు చేస్తారు. దీని కింద దీపం పెడితే సకల కష్టాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం పెడితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి.. ఈ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవీ ఆర్థిక బాధలన్నీ తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శుభప్రదం.


