News December 27, 2025

మోత్కూరు: 20 గుంటల్లో.. 23 పంటలు

image

మోత్కూరుకు చెందిన ఆదర్శ రైతు బిల్లపాటి గోవర్ధన్‌రెడ్డి కేవలం 20 గుంటల భూమిలో 23 రకాల పంటలను సాగు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. రసాయన రహిత ఆహారమే లక్ష్యంగా నాలుగేళ్లుగా సేంద్రియ సాగు చేస్తున్నారు. కాలజీరా, బహురూపి, మణిపురి బ్లాక్ వంటి దేశవాళి వరి రకాలను పండిస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల ఆధారంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News December 31, 2025

వరంగల్: SBI ట్రేడింగ్ పేరుతో రూ.37 లక్షల సైబర్ మోసం!

image

SBI ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ లెక్చరర్‌ను మోసం చేశారు. ఫేస్‌బుక్‌లో స్టాక్ మార్కెట్ లాభాల ప్రకటన నమ్మి లింక్ క్లిక్ చేసిన బాధితుడిని SBI Securities పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి నకిలీ యాప్ ఇన్‌స్టాల్ చేయించారు. 20% లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి, డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఫీజు అంటూ మొత్తం రూ.37,11,536 దోచుకున్నారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

News December 31, 2025

జపాన్‌ను దాటేసి.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

image

భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన ఎకానమీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 లోపు జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లలో 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని తెలిపింది. 2025-26 రెండో క్వార్టర్‌లో రియల్ GDP 8.2% వృద్ధి చెందిందని వెల్లడించింది.

News December 31, 2025

ప్రతిపక్ష నేత, ఉప నేత నడికూడ మండలానికి చెందిన వారే!

image

BRS శాసనమండలి పక్ష ఉప నేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ అధినేత KCR నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి ఉన్నారు. కాగా, ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఉపనేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ హనుమకొండ జిల్లాలోని నడికూడ మండలానికి చెందిన వారే కావడం విశేషం.