News October 30, 2025

మోత్కూర్ ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

image

మోత్కూర్ మండలం దత్తప్పగూడెంకి చెందిన విద్యుత్ హెల్పర్ ఓర్సు సురేష్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఓ రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ కూలడంతో విద్యుత్ లైన్ సరిచేస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే భువనగిరి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సురేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Similar News

News October 30, 2025

భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్రాజెక్టులు అన్నీ నిండినందున, ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏ సహాయం కావాలన్నా సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

News October 30, 2025

ఏలూరు: పోలీస్ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

ఏలూరులోఎస్పీ కార్యాలయ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ హౌస్ ప్రారంభించామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. పోలీసులు నిర్వహించే విధులు, వారు వినియోగించే ఆయుధాలు, వాహనాల వివరాలు, విద్యార్థి స్థాయి నుంచే తెలియజేయడం ద్వారా పోలీసు విధులు విద్యార్థులకు అవగతం అవుతాయన్నారు. పోలీసు జాగిలాలను కేసు విచారణలో ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయన వివరించారు.

News October 30, 2025

హైదరాబాద్‌లో నేటి వాతావరణం ఇలా

image

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ‘సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 21°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశలో గంటకు 04- 08 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి’ అని పేర్కొంది.