News December 16, 2025
మోదీకి గాంధీ ఆశయాలు నచ్చవు: రాహుల్ గాంధీ

గాంధీజీ ఆశయాలు, పేదల హక్కులు ప్రధాని మోదీకి నచ్చవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నుంచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. MGNREGAపై కొత్త బిల్లు ప్రవేశపెట్టడం గాంధీని అవమానించడమేనన్నారు. నిరుద్యోగంతో ఇప్పటికే యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారని చెప్పారు.
Similar News
News December 18, 2025
గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గుముఖం: DGP

AP: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని DGP హరీశ్ గుప్తా పేర్కొన్నారు. ‘2023-24లో 1,10,111 నేరాలు నమోదైతే 2024-25లో 1,04,095 దాఖలయ్యాయి. అల్లర్లు 52.4%, SC, STలపై నేరాలు 22.35%, స్త్రీలపై అకృత్యాలు 22.35% తగ్గాయి. 4 నెలల్లో 2,483 మంది అదృశ్యమైన మహిళల ఆచూకీ కనుగొన్నాం. వారిలో 1177 మంది యువతులున్నారు’ అని తెలిపారు. 55% మేర రికవరీ రేటు సాధించామని డీజీపీ వెల్లడించారు.
News December 18, 2025
భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్‌లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్‌లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్‌పుత్ క్షమాపణలు చెప్పారు.
News December 18, 2025
SMAT ఫైనల్.. ఝార్ఖండ్ భారీ స్కోర్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో ఝార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 పరుగులు చేసింది. హరియాణా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇషాన్ కిషన్ 101(49B), కుమార్ 81(38B), అనుకుల్ రాయ్ 40(20B), రాబిన్ 31*(14B) అదరగొట్టారు. విజయం కోసం హరియాణా 263 స్కోర్ చేయాల్సి ఉంది.


