News March 16, 2026
మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్ ఖాన్‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Similar News
News April 13, 2026
ఊసరవెల్లికే పోటీ.. 2 రోజుల్లో 3 పార్టీల నుంచి నామినేషన్

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. భరత్ సింగ్ వాఖ్లా అనే వ్యక్తి ఊసరవెల్లినే డామినేట్ చేస్తూ పార్టీల కండువాలను మార్చేశారు. దాహోద్(D) పైపెరో స్థానానికి రెండు రోజుల్లో 3 జాతీయ పార్టీల(BJP, INC, AAP) నుంచి నామినేషన్ వేశారు. ఎల్లుండితో విత్‌డ్రా గడువు ముగియనుండగా ఆయన అంతిమంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆసక్తికరం. భరత్ 2017లో కాంగ్రెస్, 2022లో ఆప్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
News April 13, 2026
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ‘XChat’: మస్క్

వాట్సాప్ డేటా భద్రతపై <<19612326>>విమర్శలు<<>> వస్తున్న వేళ X అధినేత ఎలాన్ మస్క్ ‘XChat’ను ప్రకటించారు. ఏప్రిల్ 17న iOSలో లాంచ్ కానున్న ఈ యాప్‌కు ఫోన్ నంబర్ అవసరం లేదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, సెల్ఫ్-డిస్ట్రక్ట్ మెసేజ్(వాటంతటవే మెసేజ్‌లు డిలీట్) వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ సూపర్ యాప్‌లో 481 మందితో గ్రూప్ చాట్స్, ఆడియో-వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీ X అకౌంట్‌తోనే దీనిని వాడవచ్చు.
News April 13, 2026
RCB సూపర్ రికార్డ్

వాంఖడే వేదికగా MIతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఆర్సీబీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 200+ స్కోర్‌ను డిఫెండ్ చేసుకొని అత్యధిక విజయాలు(23) సాధించిన జట్టుగా CSK సరసన చేరింది. ఆ తర్వాత MI, SRH(18), RR, KKR(15) ఉన్నాయి. ఇక వాంఖడేలో 2016 నుంచి వరుసగా ముంబై చేతిలో ఆరు మ్యాచుల్లో ఓడిపోయిన ఆర్సీబీకి.. ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఓవరాల్‌గా వరుసగా నాలుగో గెలుపు.


