News January 30, 2025
మోపాడు రిజర్వాయర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్

పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమిమ్ అన్సారియా రిజర్వాయర్ నీటి సామర్థ్యం, సాగు చేస్తున్న పంట పొలాల విస్తీర్ణం గురించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2025
ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 13, 2025
భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూఅక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
News March 13, 2025
ప్రకాశం: సమస్యాత్మకంగా 6 పరీక్షా కేంద్రాలు

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొమరోలు గవర్నమెంట్ హైస్కూల్, బెస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల, పెద్దారవీడు మండలం వైడిపాడు, అర్ధవీడు మండలం మాచవరం, రాచర్ల, CSపురం జిల్లా పరిషత్ పాఠశాలలను సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.