News September 21, 2024

మోపాల్: పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్‌కు చెందిన లచ్చిరాం- నిర్మల దంపతుల కుమారుడు మూడు అజయ్ పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు. వారి తల్లిదండ్రులు వారికున్న రెండు ఎకరాల భూమిని సాగు చేస్తూ అజయ్‌ను HYDలో ఉన్నత చదువులు చదివించారు. మొదటగా అజయ్ రైల్వేలో ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే ఎస్సై జాబ్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన అజయ్‌ని గ్రామస్థులు అభినందించారు

Similar News

News September 21, 2024

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దోమకొండ అంబర్పేట్‌కి చెందిన వీణ (23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి (24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన సాయి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వీణ సైతం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 21, 2024

ఎల్లారెడ్డి: హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి నిద్రించిన జిల్లా కలెక్టర్

image

ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. అంతకు ముందు ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్నాయా? భోజనం ఎలా ఉంటున్నది? మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

News September 21, 2024

నాగన్న బావి పునరుద్ధరణ పనులను ప్రారంభించిన కలెక్టర్

image

లింగంపేటలో పరంపర ఫౌండేషన్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.