News December 3, 2025
మోరంపూడి ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

మోరంపూడి ఫ్లైఓవర్ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
Similar News
News February 20, 2026
రాజమండ్రి: ‘లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారమే లక్ష్యం’

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ గంధం సునీత సమావేశమయ్యారు. ఈ అదాలత్‌లో గరిష్ఠ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. రాజీ పడదగిన ఎక్సైజ్ కేసులను గుర్తించి, ఆ జాబితాను న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 20, 2026
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: డీఎస్పీ

ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని, నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
News February 20, 2026
తూ.గో: ‘క్వింటా శనగలు రూ.5,875కే కొనుగోలు’

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా రూ.5,875 చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.


