News February 5, 2025

మోరిలో సత్రానికి 116 ఏళ్లు..! 

image

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని వీరభద్రయ్య అన్నదాన సత్రానికి 116 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా అంతర్వేది తీర్థానికి వచ్చే యాత్రికులకు అష్టమి, నవమి, దశమి తిథుల్లో మోరి వద్ద జాన శంకరయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తీర్థం రోజున అంతర్వేదిలోనూ భోజనాలు అందిస్తున్నారు. పూర్వం నడిచి వెళ్లే భక్తులకు ఈ సత్రమే ఆశ్రయం ఇచ్చేదని గ్రామస్థులు చెబుతున్నారు.

Similar News

News November 3, 2025

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ సభ్యులతో చర్చించారు. వైద్య పరీక్షల కోసం ART సెంటర్లకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉన్న లేబరేటరీలు, చికిత్స, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇతర సౌకర్యాలపై అరా తీశారు.

News November 3, 2025

పరమాత్ముడి గుణాలను మనం వర్ణించగలమా?

image

పరమాత్ముడి గుణాలు అనంతం. వాటిని లెక్కించడం అసాధ్యం. ఆయన మనపై కరుణతోనే ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో రామావతారం ఒకటి. ఆ మర్యాద పురుషోత్తముడి గుణాలను ఆదిశేషుడు, మహర్షులు కూడా పూర్తిగా వర్ణించలేరు. అయినా భక్తులు శాస్త్రాలలో ఆయన మహిమలను కీర్తించి, పాటించి, ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. మనం కూడా ఆ దైవ గుణాలను తెలుసుకొని, పాటించాలి. ఆయన లీలలు విని, అనుసరించిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాల వాక్కు.

News November 3, 2025

లోకేశ్వరం: మనస్పర్ధలతో యువతి.. బాధతో యువకుడు ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లాలో మనస్పర్ధలతో యువతి.. బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. లోకేశ్వరం(M) వట్టోలికి చెందిన అఖిలతో అదే గ్రామానికి చెందిన నరేశ్‌కు పరిచయముంది. కొన్ని రోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువతి పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న నరేశ్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని SI అశోక్ తెలిపారు.