News February 5, 2025
మోరిలో సత్రానికి 116 ఏళ్లు..!

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని వీరభద్రయ్య అన్నదాన సత్రానికి 116 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా అంతర్వేది తీర్థానికి వచ్చే యాత్రికులకు అష్టమి, నవమి, దశమి తిథుల్లో మోరి వద్ద జాన శంకరయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తీర్థం రోజున అంతర్వేదిలోనూ భోజనాలు అందిస్తున్నారు. పూర్వం నడిచి వెళ్లే భక్తులకు ఈ సత్రమే ఆశ్రయం ఇచ్చేదని గ్రామస్థులు చెబుతున్నారు.
Similar News
News September 16, 2025
గోపాలపట్నంలో దారుణ హత్య

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్‌లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.
News September 16, 2025
విజయవాడ ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్ ఎఫెక్ట్..!

దసరా సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చే పవిత్ర సమయంలో, సినిమా తారల నృత్యాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది దుర్గమ్మ ప్రాధాన్యతను తగ్గించడమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.