News December 24, 2024
మోసపూరిత ప్రచారాలతో జాగ్రత్త: జేసీ అభిషేక్
వినియోగదారులు మోసపూరిత ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 25, 2024
తిప్పేపల్లిలో విదేశీ అతిథులు!
ధర్మవరం నియోజకవర్గంలో సైబీరియా పక్షుల సందడి మొదలైంది. కొన్నిరోజులుగా తిప్పేపల్లి గ్రామంలో తెలుపు, నలుపు, ఎరుపు వర్ణాలతో అందంగా ఉన్న సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. వరి పొలాల వద్ద కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సైబీరియా, యూరప్ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి తిప్పేపల్లికి రావడం శుభ సూచకమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ పక్షులు ఏటా తమ గ్రామానికి వచ్చే విదేశీ అతిథులని చెబుతున్నారు.
News December 25, 2024
కళ్యాణదుర్గం మండలంలో యువరైతు ఆత్మహత్య
కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం గ్రామంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువరైతు కార్తీక్ (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కార్తీక్ పంటల సాగు కోసం రూ.12 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 25, 2024
అనంతపురం జిల్లాలో 24 గంటల్లో 644 కేసులు నమోదు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పోలీసులు దాడులు నిర్వహించారని ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఈ దాడుల్లో 644 కేసులు నమోదు చేసి రూ.1,67,230ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎంవీ కేసులు నమోదు చేయడంతో పాటు మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు.