News May 21, 2024

మోసపోయిన 11 మంది పాలమూరు న్యాయవాదులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే వీరు ముందస్తుగా ఆన్‌లైన్లో టికెట్లు బుక్ చేయించుకున్నారు. పవన్ హాండ్స్ అనే సంస్థ ద్వారా రూ.5,500 చెల్లించి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకుని పాట్నాలో దిగారు. తీరా పాట్నాలో టికెట్లు ఫేక్ టికెట్లు‌గా అధికారులు చెప్పడంతో వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించారు.

Similar News

News October 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

☞ఉపాధిపై యువత పోరాడాలి:సీఐటీయూ
☞Way2Newsతో డప్పు కళాకారులు
☞రేపు వర్షాలు:వాతావరణ శాఖ
☞ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా రవి
☞SGT అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
☞కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
☞కోస్గిలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
☞DSCలో సత్తా చాటిన వారికి ఘన సన్మానం
☞దసరా సెలవులకు ఊరెళ్తూన్నారా.? అయితే జాగ్రత్త:SIలు
☞ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

News October 2, 2024

MBNR: ‘డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి’

image

డిజిటల్ కార్డు సర్వే బృందాలు కుటుంబ వివరాలను పక్కాగా నిర్వహించాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. డిజిటల్ కార్డు సర్వే బృందాలకు కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డులలో ఈనెల 3నుంచి 7 వరకు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. సర్వే బృందాలకు MRO, MPDO, మున్సిపల్ కమిషనర్‌లు టీం లీడర్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు.

News October 2, 2024

MBNR: మండలాల వారిగా తుది ఓటర్ల సంఖ్య ఇలా..!

image

1.MBNR(రూరల్)-36,864, 2.అడ్డాకుల-24,147,
3.బాలానగర్-32,912,
4.రాజాపూర్-21,599,
5.నవాబ్ పేట-52,708,
6.మూసాపేట-21,305,
7.మిడ్జిల్-24,770,
8.కోయిల్ కొండ-50,845,
9.జడ్చర్ల-40,237,
10.హన్వాడ-39,417,
11.గండీడ్-61,608,
12.దేవరకద్ర-45,956,
13.సీసీ కుంట-37,474, 14.భూత్పూర్-26,359 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల పరిధిలో 3,836 వార్డులు ఉండగా.. మొత్తం 5,16,183 మంది ఓటర్లు ఉన్నారు.