News October 9, 2025
మోస్రా: నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

మోస్రాలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. నామినేషన్‌లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ పాల్గొన్నారు.
Similar News
News October 9, 2025
ధర్పల్లి: బడికి ఫోన్ తీసుకెళ్లాడని విద్యార్థికి TC

పాఠశాలకు సెల్ ఫోన్ తీసుకెళ్లాడని ఓ విద్యార్థికి TC ఇచ్చిన ఘటన ధర్పల్లి(M) దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాలలో బతుకమ్మ ఆడే సమయంలో సెల్ ఫోన్‌లో ఫొటోలు తీశాడు. దీంతో HM శశికళ విద్యార్థిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఈనెల 8న విద్యార్థికి TC ఇచ్చింది. పాఠశాలలో చేర్చుకోవాలని తండావాసులు గురువారం పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
News October 9, 2025
శ్రీరామసాగర్ ప్రాజెక్టులో భారీ వరద ప్రవాహం

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 80.053 టీఎంసీలకు చేరడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 59,774 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News October 9, 2025
NZB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 11న సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటన,13న అప్పీళ్ల స్వీకరణ, 14న అప్పీళ్ల పరిష్కారం, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటల తరువాత పోటీలోని అభ్యర్థుల జాబితా ప్రచురణ, 23న పోలింగ్ అన్నారు.