News February 1, 2026
మోస్రా: పాడే మోసిన పోచారం, సీపీ

విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(24) అంత్యక్రియల్లో ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీపీ సాయి చైతన్యలు పాడె మోశారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Similar News
News February 15, 2026
హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారా? కెప్టెన్లు ఏమన్నారంటే?

T20WCలో భాగంగా భారత్, పాక్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. కాగా పహల్గామ్ ఘటన తర్వాత భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్ ఇవ్వడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మ్యాచ్‌లో హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారా? అనే ప్రశ్నలకు ఇరు జట్ల కెప్టెన్లు నిన్న స్పందించారు. ‘ఇంకా టైముంది కదా.. టాస్ వేసే సమయానికి చూడండి’ అని సూర్య అన్నారు. అటు పాక్ కెప్టెన్ అఘా ‘దాని గురించి రేపు చూద్దాం’ అన్నారు.
News February 15, 2026
గద్వాల్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై కీలక భేటీ

గద్వాల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఆదివారం HYDలో ఎంపీ మల్లు రవి, MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, DCC అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి భేటీ అయ్యారు. రేపు జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో స్వతంత్రుల మద్దతు కూడగట్టడం, కౌన్సిలర్లను సమన్వయం చేయడంపై దిశానిర్దేశం చేశారు.
News February 15, 2026
మదనపల్లెకు టమాటాలు రావడం లేదు..!

మదనపల్లె మార్కెట్‌కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు. బయట రాష్ట్రాల్లోనూ పంటలు పడటం, రేట్లు తక్కువగా ఉండటంతో వ్యాపారులు అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం 35వేల కిలోల టమాటా మాత్రమే వచ్చింది. 10కిలోల మొదటి రకం రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160తో అమ్ముడుపోయాయి.


