News January 27, 2026
మోహన్ బాబుకు బెంగాల్ ఎక్సలెన్స్ అవార్డు

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ చేతుల మీదుగా అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు అందజేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అమితాబ్-దీపిక నటించిన ‘పీకు(piku)’ డైరెక్టర్ షూజిత్ సిర్కార్ సైతం ఈ పురస్కారం అందుకున్నారు.
Similar News
News February 25, 2026
మంత్ర పఠనం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మంత్ర పఠనం ఓ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంత్రాలను క్రమం తప్పకుండా పఠిస్తే మన చుట్టూ ‘మంత్ర కవచం’ అనే రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుంది. ఏకాగ్రత పెంచి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. భగవంతునితో అనుసంధానం కావడానికి, ఆత్మశాంతిని పొందడానికి మంత్ర పఠనం ఓ సులభమైన మార్గం.
News February 25, 2026
జీడీపీ దూకుడు: 8 శాతం దాటనున్న వృద్ధి!

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి ఏకంగా 8.1 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గ్రామాల్లో పంటల దిగుబడి బాగుండటం, నగరాల్లో జనం ఖర్చులు పెరగడమే దీనికి కారణం. ఫిబ్రవరి 27న వెలువడే ప్రభుత్వ అధికారిక లెక్కల్లో ఈ విషయం స్పష్టంగా తెలియనుంది.
News February 25, 2026
విమాన ప్రయాణం సేఫ్.. DGCA కొత్త రూల్స్!

విమాన ప్రమాదాలు పెరుగుతుండటంతో DGCA రూల్స్ మార్చేసింది. చార్టర్డ్ విమానాల ఓనర్లు వెబ్‌సైట్‌లో విమాన వయసు, పైలట్ ఎక్స్‌పీరియన్స్ వంటి వివరాలన్నీ పెట్టాలి. సేఫ్టీ విషయంలో పైలట్లనే కాకుండా పైఅధికారులనూ బాధ్యుల్ని చేస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తే పైలట్ లైసెన్స్ ఐదేళ్ల వరకు కట్ అవుతుంది. వాతావరణం బాగోకపోతే విమానం ఆపేసే పవర్ పైలట్‌కు ఇచ్చారు. ఆపరేటర్లు రియల్ టైమ్ వెదర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.


