News January 7, 2026

మౌలానా వర్సిటీ భూములు వెనక్కి తీసుకుంటే ఉద్యమమే: సంజయ్

image

TG: HYDలోని మౌలానా ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘వీటిని అమ్మి దోచుకోవాలని చూస్తున్నారు. సల్కం చెరువును ఆక్రమించి విద్యా వ్యాపారం చేస్తున్న ఒవైసీపై చర్యలేవి? వాటిని ఎందుకు తీసుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు. GOVT తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా వర్సిటీలో వినియోగించని 50 ఎకరాల స్వాధీనానికి గతనెల కలెక్టర్ నోటీసులిచ్చారు.

Similar News

News February 18, 2026

మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

TG: న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువిచ్చింది.

News February 18, 2026

ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

image

1745: బ్యాటరీ ఆవిష్కర్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (ఫొటోలో)
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం

News February 18, 2026

ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

image

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్‌పాండే(60) కన్నుమూశారు. క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. హిందీ, మరాఠీ సినిమాలతోపాటు టీవీ, వెబ్ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్‌తో రెడీ మూవీతోపాటు ఏక్ విలన్, పరమాణు తదితర ఎన్నో మూవీల్లో కనిపించారు.