News August 12, 2024

మౌస్ డీర్ సంతతి కేంద్రంగా నెహ్రూ జూపార్క్

image

నెహ్రూ జూపార్క్ మూషిక జింకల (మౌస్ డీర్) సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలోని షెడ్యూల్-1లో మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో 2010 మార్చి 3న, నెహ్రూ జూపార్క్‌ను ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ వాటి సంతతి కేంద్రంగా దీన్నిిి గుర్తించింది. ఆ తర్వాత ఇందులో 500 మూషిక జింకలు జన్మించాయి.

Similar News

News February 21, 2026

HYD: 5 ఓట్లు ఉంటే రూ.లక్ష..!

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓట్ల కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బరిలో నిలిచిన వారు ఒకరిని మించి ఒకరు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఐదు ఓట్లు ఉన్న ఇంటికి లక్షల్లో డబ్బులు అందినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చ నడుస్తోంది.

News February 20, 2026

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

image

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.

News February 20, 2026

HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

image

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.