News January 30, 2025
మ్ముమిడివరం: ‘ఈవీఎం, వీవీ ప్యాడ్‌లకు పటిష్ట భద్రత’

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు, వివి ప్యాడ్ లకు పటిష్ట భద్రత చేకూర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కార్యనిర్వాహక అధికారి తాతబ్బాయి అన్నారు. గురువారం ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాలలో మూడో అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను ఆయన తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్ రాజకుమారితో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ గూర్చి అధికారులతో చర్చించారు.
Similar News
News February 14, 2026
రామాయంపేట: డైరెక్టర్‌గా ఉంటూ.. కౌన్సిలర్‌గా గెలుపు

మహంకాళి దేవాలయం డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న బైరం స్వప్న, ఇప్పుడు రామాయంపేట కౌన్సిలర్‌గా తన ముద్ర వేశారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలోనే ఆమెను దేవాలయ డైరెక్టర్‌గా ఎమ్మెల్యే రోహిత్ నియమించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ఇప్పుడు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్వప్న ధీమా వ్యక్తం చేశారు.
News February 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.
News February 14, 2026
సిద్దిపేట జిల్లాలో హస్తం, కారు జోరు.. కమలం బేజారు !

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపల్ పోరు కాంగ్రెస్, BRS మధ్యే జరిగింది. గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ హుస్నాబాద్, చేర్యాలలో కనీసం ఖాతా తెరలేదు. దుబ్బాకలో 2 సీట్లు గజ్వేల్లో ఒక సీటుకే పరిమితమైంది. మొత్తం 4 మున్సిపాలిటీల్లో 3 BRS, ఒకటి కాంగ్రెస్ దక్కించుకుంది. మున్సిపల్ ఫలితాలపై BRS, కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉండగా బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.


