News March 2, 2026

మ్యాగ్జిమం కిక్ కోసం కాఫీ ఎప్పుడు తాగాలంటే..

image

చాలామంది నిద్రలేవగానే బెడ్ కాఫీతో రోజును స్టార్ట్ చేస్తారు. కానీ కొన్ని స్టడీస్ ప్రకారం దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. మార్నింగ్ లేచిన ఒక గంట తర్వాత కాఫీ తాగితేనే ఎనర్జీ బూస్ట్ అవుతుందట. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య వచ్చే డల్‌నెస్‌ను పోగొట్టడానికి కాఫీ బెస్ట్ ఆప్షన్. వర్కౌట్స్‌కి 30-60 నిమిషాల ముందు తీసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు కాఫీకి దూరంగా ఉంటే నిద్ర డిస్టర్బ్ అవ్వదు.

Similar News

News March 2, 2026

చనిపోయిన ఖమేనీ మనుమరాలు ఈ పాపనే..

image

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఆయన కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా <<19281898>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. తాజాగా 14 నెలల మనుమరాలు జహ్రా మొహమ్మది ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పసిప్రాయంలో ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అత్యంత భద్రత ఉండే ఖమేనీ గృహసముదాయంపై ఏకంగా 30 శక్తిమంతమైన బాంబులను పేల్చి హతమార్చారు.

News March 2, 2026

యువవికాసం: 16.5L అప్లికేషన్లకు ఇచ్చింది జీరో

image

TG: యువతకు ఆర్థిక సాయం కోసం GOVT రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి 2025-26 బడ్జెట్లో ₹6వేల CRను కేటాయించింది. ₹4 లక్షలు సబ్సిడీగా అందే ఈ పథకం కోసం 16.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత JUN 2న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరగాలి. కానీ చివరి నిమిషంలో ఆర్థిక శాఖ నిధులు లేవనడంతో జరగలేదు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? ఇచ్చినా అమలు చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 2, 2026

ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్‌కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.