News January 22, 2026

‘మ్యాజిక్ వీవ్స్’తో మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారాలి: కలెక్టర్

image

మహిళల సాధికారత, ఉపాధి సృష్టే ధ్యేయంగా జిల్లాలో ‘మ్యాజిక్ వీవ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆప్కో ఆధ్వర్యంలో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చనున్నట్లు తెలిపారు. మన సంప్రదాయ చేనేత రంగానికి ఆధునిక డిజైన్లను జోడించి, పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

Similar News

News April 10, 2026

HYD: రాజకీయ నేత కుమారుడి లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

image

హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ రాజకీయనేత కుమారుడి లైంగిక వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని బయటకు చెబితే కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి బాధితులు వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం.

News April 10, 2026

HYD నుంచి అయోధ్య, కాశీకి రైళ్లు

image

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, 3 పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ.14,500 నుంచి రూ.34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల వారు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

News April 10, 2026

తెనాలి: ITI ఉత్తీర్ణులైన విద్యార్థులకు GOOD NEWS

image

తెనాలి చినరావూరులోని ప్రభుత్వ ITI శిక్షణ కేంద్రంలో ఈనెల 13న నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ITI ఉత్తీర్ణులైన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పారు. అప్రెంటిస్ మేళాలో 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో ఆ రోజు నేరుగా హాజరుకావొచ్చన్నారు.