News March 19, 2024

మ్యాడంపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి

image

జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామశివారులోని చెట్లపొదల్లో మహిళ చనిపోయి పడి ఉండటంతో అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 6, 2026

జమ్మికుంట: భార్యాభర్తల గొడవ.. భర్త ఆత్మహత్య

image

భార్యాభర్తల మధ్య ఆర్థిక గొడవల కారణంగా జమ్మకుంటకు చెందిన భర్త సుద్దాల శ్రీనివాస్‌(39) మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ రామకృష్ణ గౌడ్‌ వివరాలిలా.. శ్రీనివాస్‌ భార్య మనమ్మ, భర్తకు తెలియకుండా తన సోదరికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి ఆ సొమ్ము అడిగినా రాకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్‌ లుంగీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

News February 6, 2026

పదేళ్లలో చొప్పదండి నిర్లక్ష్యానికి గురైంది: మంత్రి పొన్నం

image

గత పదేళ్ల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిందన్నారు. సీఎం నాయకత్వంలో విద్యా, వైద్యం, సాగునీటి రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని పేర్కొన్నారు.

News February 5, 2026

KNR: మెజారిటీకి అడ్డంకిగా ‘త్రిముఖ’ పోరు!

image

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు స్వతంత్రులు, రెబల్స్ సవాల్‌గా మారారు. 66 డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మరోవైపు ఎంఐఎం 15 చోట్ల, జనసేన, బీఎస్పీలు గణనీయమైన స్థానాల్లో పోటీ చేస్తూ తృతీయ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు భారీగా చీలిపోయి, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.