News March 19, 2024
మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్
గ్రేటర్ HYDలోని మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పనులు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న నాలాలు, మ్యాన్‌హోళ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రక్షణ చర్యలపై సర్వే చేస్తున్నారు. 2023-24లో రూ.543.26 కోట్లతో 888 పనులను ఆమోదించగా అందులో 311 రూ.162.53 కోట్లతో పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
Similar News
News December 29, 2024
మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లలేదా.. నేడే ఆఖరు!
చినిగిన చొక్కా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక మంచి పుస్తకం కొనకుంటే, నీ జీవితమంతా అజ్ఞానమే అన్నారు మరికొందరు మేధావులు. అందుకేనేమో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బుక్ ఫెయిర్ – 2024 నిరంతరం పుస్తక ప్రియులతో నిండుగా కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. మరి మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లారా..? అక్కడ ఏ పుస్తకం కొన్నారో కామెంట్ ప్లీజ్..!
News December 29, 2024
జూబ్లీహిల్స్‌లో 4 పబ్‌లకు అనుమతి లేదు!
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.
News December 29, 2024
హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు!
గడచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోండామార్కెట్ 18.2℃, వెస్ట్ మారేడ్‌పల్లి, షేక్‌పేట, రియాసత్‌నగర్ 18.4, కంచన్‌బాగ్, చంద్రయాన్ గుట్ట 18.7, జూబ్లీహిల్స్, గోల్కొండ 18.8, ఓయూ 18.9, షేక్‌పేట, అడిక్‌మెట్, మెట్టుగూడ, బంజారాహిల్స్ 18.9, బౌద్ధ నగర్, తిరుమలగిరి, బండ్లగూడ 19, లంగర్‌హౌస్, కందికల్ గేట్, బోరబండ 19.2, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, చిలకలగూడలో 19.3℃గా నమోదైంది.