News March 5, 2026
యంగ్ ఇండియా స్కూల్స్‌లో భారీ అవినీతి: హరీశ్ రావు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో భారీ అవినీతి జరిగిందని, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. టెండర్ల కేటాయింపులపై వివరాలు త్వరలో బయటపెడతానన్నారు. పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు లేదని విమర్శించారు. ఖమ్మం, దేవాదుల, హెల్త్ సిటీ అంశాల్లో ప్రతిపక్షంగా ఒత్తిడి తీసుకురాగానే ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. జర్నలిస్టుల హెల్త్ స్కీంను నిర్లక్ష్యం చేశారని, తమ హయాంలో ప్రత్యేక జీవో ఇచ్చామన్నారు.
Similar News
News April 14, 2026
అమీన్‌పూర్‌లో కూల్చివేతలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

యంగ్ ఏజ్‌లో అతిగా డ్రింక్ చేస్తే..

స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి మద్యం సేవించే యూత్‌కు మసాచుసెట్స్ వర్సిటీ రీసెర్చర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. యంగ్ ఏజ్‌లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మధ్యవయసుకొచ్చే సరికి మెదడు పనితీరు మందగిస్తుందని తేల్చారు. తర్వాత మానేసినా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తిరిగిరాదన్నారు. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అప్పుడు కోలుకోవడానికి ప్రత్యేక చికిత్సలు అవసరమని తెలిపారు.