News November 11, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 1

image

1. సూర్యుణ్ణి ఉదయింపజేయువారు ఎవరు? (జ.బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (జ.దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (జ.ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (జ.సత్యం)
5. మానవుడు వేటి వలన శ్రోత్రియుడగును? (జ.వేదాలు)
6. దేనివలన మహత్తును పొందును? (జ.తపస్సు)
7. మానవునికి సహయపడుతుంది ఏది? (జ.ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (జ.పెద్దలను సేవించుట వలన) <<-se>>#YakshaPrashnalu<<>>

Similar News

News November 11, 2025

మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

image

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.

News November 11, 2025

రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

image

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్‌పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

News November 11, 2025

దేశంలో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్: అదానీ

image

దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌(BESS)ను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. గుజరాత్‌లోని ఖవ్డాలో నెలకొల్పుతున్న ఇది 2026 మార్చికి పూర్తవుతుందన్నారు. 1126 MW సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతుంది. 3 గంటలపాటు ఏకధాటిగా అంతే స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తుంది. 700 బ్యాటరీ కంటైనర్లను దీనిలో వినియోగిస్తారు. ఇది గ్రిడ్‌ను 24 గంటల పాటు స్థిరంగా ఉండేలా చూస్తుంది.