News February 17, 2025
యజమానులకు చెప్పకుండా సర్వే చేయవద్దు: JC

భూ యజమానులకు తెలియకుండా సర్వే చేయరాదని ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎంతమంది రైతులకు నోటీసులు ఇచ్చారో తెలుసుకున్నారు. నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.
Similar News
News February 20, 2025
ప.గో : జాతీయ కబడ్డీ పోటీలకు శ్రీకాంత్ ఎంపిక

ఆంధ్ర పురుషుల కబడ్డీ జట్టులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జి.శ్రీకాంత్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 3వతేదీ నుంచి 18వ తేదీ వరకు విశాఖలో 20 మంది ప్రాబబుల్స్‌కు శిక్షణ జరిగిందన్నారు. దీనిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జట్టులో 12 మందిని ఎంపిక చేశారన్నారు.
News February 20, 2025
నిడమర్రు: భార్య ఫోన్ నుంచి మెసేజ్.. ఇంటికి రాగానే హత్య

నిడమర్రులోని బావాయిపాలెంలో మజ్జి ఏసు హత్య కేసులో ఏసుబాబు, అన్నవరం, శ్రీనివాసరావును బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రావణ్ కథనం..పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసు బాబుకు వివాహేతర సంబంధం ఉంది. పెద్దల సమక్షంలో వార్నింగ్ ఇచ్చినా వారి తీరు మారలేదు. దీంతో పిల్లి ఏసు భార్య ఫోను నుంచి 15 రోజుల ముందు నుంచే పథకం ప్రకారం మెసేజెస్ చేసేవారు. ఈనెల 15న ఆమె ఇంటికి రప్పించుకుని, ఒక చోటుకి తీసుకెళ్లి హత్య చేశారు.
News February 20, 2025
ఏలూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష

బాలిక గర్భణి కావడానికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష పడింది. గణపవరం మండలం పిప్పరకు చెందిన దొంగ చిన్నబ్రహ్మయ్య 2014లో పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను గర్భవతిని చేసి దుబాయ్ పారిపోయాడు. తర్వాత బాలికకు పుట్టిన బిడ్డ చనిపోయింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఏలూరు జిల్లా పోక్సో కోర్టు స్టేషన్ జడ్జి సునంద తీర్పు చెప్పారు.