News January 31, 2026
యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే

AP: భూముల రీసర్వేలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ‘ప్రస్తుతం కొత్తగా చేపట్టే సర్వేలో భూయజమానిని తప్పనిసరిగా భాగస్వామిని చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆయన వచ్చాకనే రీసర్వే చేయాలి. భూ రికార్డు వివరాలను యజమానులకు చూపించి ఓకే అంటేనే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. ప్రతినెల 2-9 తేదీల మధ్య పాస్ పుస్తకాలు అందించాలి’ అని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది.
Similar News
News February 21, 2026
మహిళలకు ఫ్రీ బస్.. రూ.50 చెల్లిస్తేనే!

TG: RTCలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌరసరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకొని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5L మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. కార్డులు లేని వారు ఆధార్‌తో ఫ్రీ జర్నీ చేయవచ్చు. బస్‌పాస్/మీ-సేవా సెంటర్లలో ₹50 చెల్లించి కార్డు తీసుకోవాలని తెలుస్తోంది.
News February 21, 2026
లొంగు‘బాట’లో దేవ్‌జీ?

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్‌జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్‌గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్‌జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.
News February 21, 2026
ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/


