News December 29, 2025
యథావిధిగా ‘జిల్లాలో మీ కోసం’: కలెక్టర్

ఈ నెల 29న ‘జిల్లాలో మీ కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదికను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబరు, 9552300009 వాట్సప్ సేవల ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News January 2, 2026
‘జిల్లాలో నేటి నుంచి నాలుగో విడత భూ రీసర్వే’

జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే పక్రియను శుక్రవారం నుంచి ప్రారంభిస్తు న్నట్లు జిల్లా సర్వే భూమి రికార్డుల అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలో గతేడాది చేపట్టిన మూడు విడతల రీ సర్వేలో 36 గ్రామాల్లో 73,339 ఎకరాల్లో పూర్తి చేసామన్నారు. రాజమహేంద్రవరం డివిజన్లో 8 గ్రామాల్లోనూ, కొవ్వూరు డివిజన్లో 11 గ్రామాల్లోనూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు తమ వంతు సహకరించాలని ఆయన కోరారు.
News January 2, 2026
తూ.గో: యర్నగూడెం హైవేపై గుర్తు తెలియని మహిళ మృతి

దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సుమారు 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు ఆకుపచ్చ చీర ధరించి, చేతిలో బకెట్, బూడిద గుమ్మడికాయతో ఉన్నట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
News January 2, 2026
జిల్లాలో విస్తారంగా పొగాకు సాగు!

గత సీజన్‌లో లాభాలు పండటంతో జిల్లాలో వర్జీనియా పొగాకు సాగు జోరుగా సాగుతోంది. గోపాలపురం వేలం కేంద్రం పరిధిలో 3,020 హెక్టార్లు, దేవరపల్లి పరిధిలో 4,566 హెక్టార్లలో రైతులు నాట్లు వేశారు. రెండు కేంద్రాల పరిధిలో సుమారు 3,461 మంది రైతులు 4,039 బ్యారెన్ల ద్వారా సాగు చేస్తున్నారు. మొత్తం సాగులో 30 శాతానికి పైగా వర్జీనియా పొగాకు ఇక్కడే ఉండటం విశేషం.


