News March 1, 2026

యథావిధిగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్

image

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా రావడమే కాకుండా, https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని ఆమె వెల్లడించారు.

Similar News

News March 2, 2026

JNTUHలో 45 మంది అధ్యాపకులకు పదోన్నతులు

image

JNTUHలో కెరీర్ CAS కింద 45 మంది బోధనా అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. VC డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు సమక్షంలో ఆర్డర్ కాపీలు అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్‌గా 9 మంది, ప్రొఫెసర్‌లుగా 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్‌గా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ హయ్యర్ గ్రేడ్ పే పొందారు.

News March 2, 2026

భీకర దాడి జరగబోతోంది.. ప్రజలు బయటకు రావొద్దు: ట్రంప్

image

ఇరాన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘మా సైన్యం ఇరాన్ నుంచి చెత్తను తొలగిస్తోంది. మేమింకా భారీస్థాయిలో దాడి చేయలేదు. త్వరలో భీకర దాడి జరగబోతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. బయట సేఫ్ కాదు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం నాకూ ఇష్టం లేదు. 4 వారాల్లో ముగుస్తుందని భావిస్తున్నా. ఇరాన్ ప్రజలు తమ దేశంపై నియంత్రణ సాధించాల్సిందే. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని CNNతో తెలిపారు.

News March 2, 2026

భీమవరం: పోలీస్ శాఖ పీజీఆర్ఎస్‌కు 14వ అర్జీలు

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 14 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా అందాయి. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.