News December 29, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News December 30, 2025

వంద ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘మోదెల’ గ్రామానికి విద్యుత్ భాగ్యం!

image

శతాబ్ద కాలంగా విద్యుత్‌కు నోచుకోని మారుమూల గిరిజన గ్రామం ‘మోదెల’ ఎట్టకేలకు సౌరకాంతులతో మెరిసిపోయింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ వెట్రిసెల్వి చొరవ తీసుకుని రూ. 12.5 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయించారు. 23 గిరిజన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లభించడంతో, గ్రామస్తులు కలెక్టరేట్‌కు విచ్చేసి జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ, విద్యుత్ శాఖ అధికారులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

News December 30, 2025

పోడూరులో కీచక ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

image

పోడూరు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 4, 5 తరగతులు చదువుతున్న చిన్నారుల పట్ల సదరు ఉపాధ్యాయుడు గత కొద్దిరోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సై సుధాకర్ రెడ్డి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News December 30, 2025

కలెక్టర్‌కి పదోన్నతి.. అధికారుల అభినందనల వెల్లువ

image

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.