News January 19, 2026
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ వెట్రిసెల్వి

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా సోమవారం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదుల స్థితిని, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News February 17, 2026
చనిపోయి 4 రోజులు.. దేవుడు బతికిస్తాడని..

TG: HYD కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో శైలజ(43) అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆమెను ఏసుప్రభు మళ్లీ బతికిస్తాడనే మూఢనమ్మకంతో తల్లి శమంతకమణి, తోబుట్టువులు జయరాం, సునీత.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి 4 రోజులు ప్రార్థనలు చేశారు. దుర్వాసన రావడంతో అంత్యక్రియలు చేయాలని స్థానికులు చెప్పగా వారితో గొడవకు దిగారు. చివరికి పోలీసులను పిలిపించడంతో మృతదేహాన్ని స్వగ్రామం ఏపీలోని కైకలూరుకి తరలించారు.
News February 17, 2026
అనంత: కోర్టులో ఉద్యోగాలకు పరీక్షలు

కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భీమారావు తెలిపారు. అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు శ్రీ బాలాజీ PG కాలేజీ, PVKK ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, కావలసిన వస్తువులతో పాటు గంట ముందుగానే హాజరుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.
News February 17, 2026
అన్నమయ్య జిల్లాలో మరో దారుణ హత్య

అన్నమయ్య జిల్లాలోని గాలివీడులో స్టోర్ డీలర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని ఒడిసిలెంకవారిపల్లె రేషన్ షాప్ డీలర్ టి. కృష్ణారెడ్డిని కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి డీఎస్పీ చేరుకొని విచారిస్తున్నారు. అలాగే మదనపల్లెలో బాలికను ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే.


