News October 12, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News October 12, 2025
తణుకు: ఆడుకుందామని వెళ్లి.. కాలువలో పడి గల్లంతు

తణుకు మండలం పైడిమర్రు కాలువలో ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. తణుకుకి చెందిన 8వ తరగతి చదువుతున్న బొమ్మనబోయిన జోగేంద్రగా గుర్తించారు. ఆదివారం కావడంతో జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News October 12, 2025
పైడిపర్రు కాలువలో పదేళ్ల బాలుడు గల్లంతు

తణుకు మండలం పైడిపర్రు కాలువలో ఆదివారం మధ్యాహ్నం 10ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సుమారు పదిమంది కాలువలో దిగి ఆడుకుంటూ ఉండగా వీరిలో గుర్తుతెలియని బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు కాలువలోకి దిగి గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
News October 12, 2025
ఉండి: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తాండేశ్వర్ స్వామి ఆలయానికి లీజులో ఉన్న రొయ్యల చెరువు వద్ద శనివారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బహదూర్ (25) అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. చెరువులోని మోటారు ఆగిపోవడంతో దాన్ని పరిశీలించేందుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. నెలవారీ జీతానికి పనిచేస్తున్న యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.